డబ్ల్యూపీఎల్ లో ఫైనల్ చేరిన ఆర్సీబీ

Spread the love

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-4లో ఫైనల్ చేరిన మొదటి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. స్మృతీ మంథాన సారథ్యంలోని ఆ జట్టు తాజాగా యూపీ వారియర్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ 55 (43; 6×4,1×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. మెగ్ లానింగ్ 41 (30; 6×4, 1×6) పర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. బెంగళూరు బౌలర్లలో నడినె డి క్లార్క్ 4వికెట్లతో సత్తా చాటింది. గ్రేస్ హారిస్ 2వికెట్లు పడగొట్టింది. లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 13.1 ఓవర్లలోనే 147 పరుగులు చేసి అదరగొట్టింది. పూర్తి ఏకపక్షంగా సాగింది. గ్రేస్ హారిస్ 75 (37; 13×4, 2×6), స్మృతీ మంథాన 54 నాటౌట్ (27; 8×4, 2×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇక యూపీ బౌలర్లలో శికా పాండే, ఆశా శోభనా జాయ్ చెరొక వికెట్ పడగొట్టారు.