థాయిలాండ్ మాస్టర్స్ క్వార్టర్స్ లో  భారత షట్లర్ ఇషారాణి

Spread the love

భారత యువ షట్లర్ ఇషారాణి బారువా థాయిలాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో సీడ్ సౌత్ కొరియాకు చెందిన సంగ్ షువో యున్ పై గెలిచి క్వార్టర్స్ కు  దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఆమె 21-13, 14-21, 21-14తో సంగ్ పై విజయం సాధించింది. మరో మ్యాచ్ లో  దేవిక షగ్ 21-14, 21-14తో చైనీస్ తైపీకి చెందిన టుంగ్ టాంగ్ పై గెలిచి క్వార్టర్స్ చేరింది. పోటాపోటీగా సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్, తరుణ్ మన్నెపల్లి 21-17, 14-21, 24-22తో టింగ్ యెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు.  కిరణ్ జార్జ్ 16-21, 11-21తో ఇండొనేసియాకు చెందిన బగాస్ షుజివో  చేతిలో,మిథున్ మంజునాథ్  21-11, 16-21, 12-21తో  మలేసియాకు చెందిన జియా  చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.