మలేసియా ఓపెన్ సెమీస్ లో సింధు ఓటమి

Spread the love

మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పి.వి. సింధు సెమీస్ లో ఓటమితో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాజాగా నేడు  జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన  రెండో సీడ్ వాంగ్ జి యి చేతిలో సింధు 16-21, 15-21 వరుస గేమ్ లలో ఓడి ఈ టోర్నీలో తన పోరాటాన్ని ముగించింది. ఈ టోర్నీలో ఇప్పటికే పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం  కూడా క్వార్టర్స్ దశలోనే పరాజయం చెందారు.