ప్రధాని మోడీని కలిసిన సచిన్ కుటుంబం..కుమారుడి పెళ్లికి ఆహ్వానం

Spread the love

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు సానియా చందోక్ కు  అతడు వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 5న ముంబయిలో వీరి వివాహం జరగనుంది. తన కుమారుడి వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు  సచిన్ కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని మోడీకి తాజాగా ఆహ్వాన పత్రికను అందజేశారు. చందోక్ తల్లిదండ్రులు కూడా వెంట వచ్చారు. వారందరినీ ప్రధాని ఆత్మీయంగా పలకరించి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మోడీతో  ఇరు కుటుంబాలు కలిసి ఫొటో దిగాయి. అర్జున్, సానియా ప్రధానితో ప్రత్యేకంగా ఫొటో దిగారు. ఈ విషయాన్ని సచిన్ ఇన్స్టాగ్రామ్ లో  అభిమానులతో షేర్ చేసుకున్నాడు.