ఉమెన్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ దూసుకుపోతోంది. ఈ మెగా లీగ్ లో ఆ జట్టు వరుసగా 5వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగులతో ఘన విజయం కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గౌతమి నాయక్ 73 (55; 7×4, 1×6) రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 117 పరుగులకే పరిమితమైంది. సయాలి 3 వికెట్లు,డిక్లెర్క్ 2వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ ఆష్లీ గార్డ్ నర్ 54 (43; 5×4, 1×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నీలో గుజరాత్ కు ఇది మూడో ఓటమి. ఇక ఈ టోర్నీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన టీమ్ లు ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. టేబుల్ టాపర్ డైరెక్ట్ గా ఫైనల్ కు చేరుతుంది. మిగతా రెండు జట్లు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ ఆడతాయి.