వై.ఎస్.జగన్ ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదని ల్యాండ్ సర్వే – రీ సర్వే, పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జగన్ గారు పూర్తి వాస్తవాలు చెప్పలేదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆ నిజాలు ఏమిటనేవి ప్రజలకు పూర్తిగా తెలియాలని చెబుతున్నట్లు పేర్కొన్నారు. సర్వే–రిసర్వే అనేది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ అన్నారు. Ycp ప్రభుత్వంలో గ్రీవెన్సులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఇన్సెంటివ్ రాలేదని కానీ, ప్రస్తుత ప్రభుత్వం గ్రామసభల ద్వారా 2.79 లక్షల సమస్యలు పరిష్కరించి రూ.500 కోట్ల ఇన్సెంటివ్ ను కేంద్రం ద్వారా తీసుకువచ్చిందని వివరించారు. వైసీపీపై ప్రజల వ్యతిరేకతకు కారణం సర్వే కాదు, పాస్‌పుస్తకాలపై జగన్ బొమ్మలు, రూ.680 కోట్ల ఖర్చుతో ప్రజల భూముల్లో పాతిన సర్వే రాళ్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని వివరించారు. అందుకే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేశామన్నారు. శంకర్ విలాస్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్‌కు అన్ని అనుమతులు పూర్తయ్యాయని 2027 జూలై 27లోపు పూర్తిచేయనున్నట్లు తెలిపారు.