టీ20 ప్రపంచకప్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన

Spread the love

టీ20 వరల్డ్ కప్ ఆడే సౌతాఫ్రికా జట్టును తాజాగా ప్రకటించారు. గాయం కారణంగా భారత పర్యటనలో ఆడలేకపోయిన పేస్ బౌలర్  కగిసో రబాడ జట్టులోకి తిరిగి ఎంపికయ్యాడు. అతడితో పాటు కార్బిన్ బోష్, మార్కో యాన్సెన్, క్వెనా మఫాకా, లుంగి ఎంగిడి, అర్రిచ్ నోకియా లు కూడా  ఎంపికయ్యారు. కేశవ్ మహరాజ్, జార్జ్ లిండే స్పెషలిస్టు స్పిన్నర్లుగా అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల వరుస వైఫల్యాలు చవిచూస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ను  ఎంపిక చేయలేదు. గత నెల భారత్ తో  టీ20 సిరీస్ లో  రెండు మ్యాచ్లు ఆడిన స్టబ్స్.. వరుసగా 14, 9 పరుగులే చేశాడు. ఇక భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ 20 ప్రపంచకప్ టోర్నీ ఫిబ్రవరి 7న మొదలై మార్చి 8న ముగుస్తుంది.

సౌతాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జేసన్ స్మిత్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, లుంగి ఎంగిడి, అర్రిచ్ నోకియా, కగిసో రబాడ.