భారత స్టార్ షట్లర్ పీ.వీ.సింధు మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో ప్రిక్వార్టర్పైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-13, 22-20 తో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ షువో యున్ పై గెలుపొందింది. పురుషుల డబుల్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ముందంజ వేసింది.మొదటి రౌండ్ లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-13, 21-15తో చైనీస్ తైపీకి చెందిన లీ హుయ్, యాంగ్ సువాన్ జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో జోడీ 15-21, 21-18, 15-21తో ప్రెస్లీ స్మిత్-జెనీ గాయ్ (అమెరికా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన మహిళల డబుల్స్ గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ 9-21, 23-21, 19-21తో ఇండోనేషియాకు చెందిన ఫెబ్రియాన, మెలిసా ద్వయం చేతిలోపరాజయం చెందింది.