టీ 20 బరిలో నిలిచే ఆఫ్ఘానిస్తాన్ జట్టు ఇదే.. !

Spread the love

కొత్త ఏడాది వచ్చేసింది. ఈ సంవత్సరంలోనే టీ 20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో వరుసగా దేశాలు తమ క్రికెట్ జట్లను ప్రకటిస్తున్నాయి.  తాజాగా ఆఫ్ఘనిస్థాన్ కూడా తమ జట్టును ప్రకటించింది.  అఫ్గానిస్థాన్ జట్టుకు లెగిస్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యం వహించనున్నాడు. ఫిబ్రవరి 7న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే 15 మంది సభ్యుల అఫ్గాన్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టుకు ఇబ్రహీం జద్రాన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. జనవరి 19న వెస్టిండీస్ లో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్ లోనూ ఇదే అఫ్గాన్ జట్టు ఆడుతుంది.

అఫ్గానిస్థాన్ జట్టు: రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్ (వైస్ కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్, సెదిఖుల్లా అటల్, డార్విష్ రసూల్, షాహీదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, గుల్బాదిన్ నైబ్, మహ్మద్ నబి, నూర్ అహ్మద్, ముజీబ్ రెహ్మాన్, నవీనుల్ హక్, ఫజల్హాక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్ జాయ్ రిజర్వ్లు: గజన్ఫర్, ఇజాజ్ అహ్మద్ జాయ్, జియావుర్ రెహ్మాన్.