క్వార్టర్ ఫైనల్లోకి స్టార్ షట్లర్ సింధు

Spread the love

మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తాజాగా జరిగిన  మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో ఆమె 21-8, 21-13తో జపాన్ కు చెందిన ఎనిమిదో సీడ్ తొమొక మియాజకిపై నెగ్గింది. మంచి ఫామ్లో ఉన్న సింధు కేవలం 33 నిమిషాల్లోనే మియాజకిపై అలవోకగా విజయం సాధించింది.  మరోవైపు పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్లో భారత జోడీ  21-18, 21-11తో జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ యాప్  ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్ 20-22, 15-21తో హాంకాంగ్ కు చెందిన లీ చుక్  చేతిలో, ఆయుష్ 18-21, 21-18, 12-21తో చైనా కు చెందిన టాప్ సీడ్ షై యుకి చేతిలో ఓటమి చెందారు.