కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్..పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి నిలిచిన అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎలెక్షన్ ఆఫీసర్  ఉపేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి  సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిషేక్ సింఘ్వీ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *