మద్యం సేవించి వాహనాలు నడిపిన 2 వేలకు పైగా హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ చేపట్టారు. ఈ క్రమంలో భారీగా వాహనాలను పట్టుకున్నారు. ఆల్కహాల్ సేవించి వాహనాలు నడిపిన 2,126 మందిపై ఈ సందర్భంగా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్ లో 928 మంది, రాచకొండ కమిషరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లు పోలీసులు పేర్కొన్నారు.