డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏఐసీసీ తీసుకుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కు ముందు 140 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్య్రం ఇచ్చిన రాజ్యాంగం ను ఉపయోగించుకొని పుట్టిన పార్టీ లు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాయని విమర్శించారు. భారత దేశ ఆత్మ గౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వారసత్వం గా పదవులు పొందే అవకాశం వైఎస్ షర్మిల కు ఉంది..ఐనా ఆమె తీసుకోలేదని కొనియాడారు. మహాత్మా గాంధీ , జవహర్ లాల్ నెహ్రూ దేశం కోసం జైలు కు వెళ్లారు.మహాత్మా గాంధీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళు కనీసం లాఠీ కూడా ఎత్తలేదు..కానీ స్వాతంత్ర్యం వచ్చాక భారతీయుల పార్టీ కి చెందిన వారి తూటాలకు మహాత్మా గాంధీ నేలకొరిగారు.గాంధీ,ఇందిరా,రాజీవ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు.దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు ఇచ్చారు.దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు..రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ సర్వం త్యాగం చేసి కాంగ్రెస్ కు అండగా నిలిచారు.కష్టం తెలియకుండా పదవులు పొందే అవకాశం ఉన్నా ,త్యాగాల చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర,ఆయన సంక్షేమ కార్యక్రమాలు,అభివృద్ధి కాంగ్రెస్ విజయాలలో ప్రస్తావించాలన్నారు.వైఎస్ షర్మిల తెలంగాణ లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని ఏపీ లో పార్టీ కోసం కష్ట పడుతున్నారన్నారు. జిల్లాకు అధిపతుల మని డీసీసీ అధ్యక్షులు భావించవద్దని వ్యతిరేకించిన వాళ్ళను అణిచి వేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. నేను పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగాను. కలిసికట్టుగా పనిచేయడం వల్లనే కాంగ్రెస్ 40 శాతం ఓట్లు తెచ్చుకొని అధికారం లోకి వచ్చింది. 119 నియోజక వర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయించాం. డీసీసీ అధ్యక్షులు గా బాగా పని చేసిన వారికి ఎంఎల్ ఏ లు గా అవకాశం ఇచ్చాం. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను గమనిస్తూనే ఉంటాం.కాంగ్రెస్ లో ఏ కోటా లేదు..మెరిట్ కోటా మాత్రమే ఉంటుంది. డీసీసీ అధ్యక్ష పదవి ని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. రెండుగా విడిపోయినా కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల బలపడాలని ఆకాంక్షించారు. రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి..రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలని పేర్కొన్నారు. డీసీసీలు అంటే అధికారం కాదు ఒక బాధ్యత. ఓ కుటుంబ పెద్దవంటి బాధ్యత. ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరినీ సమన్వయం చేసుకున్నప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు.