
Delhi Telangana Congress BC protest: కులగణనపై టికాంగ్రెస్ కదం తొక్కుతోందా. బిసి రిజర్వేషన్, కులగణనపై తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నారా. హస్తినలో తలపెట్టిన ధర్నా మీద కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు నెరవేరతాయా. వాచ్ దిస్ స్టోరీ.
కులగణన,బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ కదం తొక్కింది. ఆ రెండు బిల్లుల విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి టి కాంగ్రెస్ నేతలు హస్తీనకు వెళ్లారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, మంత్రులే కాదు, రాహుల్ గాంధీ తదితరులు అంతా కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ మీదే ఫోకస్ పెట్టారు. కులగణన బిల్లు, బీసీలకు 42 శాతం బిల్లుకు సంబంధించి కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చేందుకు జంతర్మంతర్ ధర్నా, రాష్ట్రపతి ముర్ముతో భేటీ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గట్టి నిర్ణయంగా తెలుస్తోంది.
కులగణన, బిసి బిల్లు విషయంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కాంగ్రెస్ పట్టబడుతుంటే, 42 శాతం రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లో 10 శాతం ముస్లింలను చేర్చారు కాబట్టి మత తత్వ రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని బిజెపి స్పష్టం చేస్తుంది. 40% రిజర్వేషన్లలో ముస్లింలను తీసేస్తే కచ్చితంగా బిల్లును ఆమోదిస్తామని బిజెపి చెప్తుంది. Delhi Telangana Congress BC protest.
ఇప్పటికే రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న నేపద్యంలో, రాష్ట్రపతిని కలిసి కులగలణ, బీసీ బిల్లు ఆవశ్యకతను వివరించాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాహుల్ గాంధీతో కలిసి రాష్ట్రపతిని అపాయింట్మెంట్ తీసుకొని కలిసి అవకాశం ఉంది, బిజెపి నేతలు మాత్రం కాంగ్రెస్ చేస్తున్న ధర్నా కు అర్థం లేదని స్పష్టం చేస్తున్నారు, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకునేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ డ్రామాకు తెరలేపిందని బిజెపి విమర్శిస్తుంది.
మొత్తానికి రేపు జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ చేయబోతున్న మహా ధర్నా తో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దిగివస్తుందా లేదా అనేది చూడాలి, రాష్ట్రపతి కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది సస్పెన్షన్ మారింది,ఒక వేళ మహాధర్నాతో బిజెపి దిగి రాకపోయినా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, కాంగ్రెస్ మరొక ఎజెండా ఏదైనా ఎత్తుకుంటుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి.
Also Read: https://mega9tv.com/telangana/khammam-wyra-brs-party-incharge-who-should-be-appointed/