రైతు సంక్షేమమే మా విధానం:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా  గ్రామంలో రైతులతో కలిసి రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభ లో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రూ. 2,200 కోట్ల నిధులను విడుదల చేయగా, ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ. 5,700 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. వచ్చే నెలలో మరో రూ.3,300 కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశానికి వెన్నెముక రైతులే. రైతులను ఆదుకుని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు.  రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ  విధానమని రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి, అధికారం చేపట్టిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు.  గతసారి కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యమని అందుకే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *