కవితక్కకు కోపం వచ్చింది..!

Spread the love

తెలంగాణ రాజకీయాలను మరోసారి షేక్ చేశారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తనకు తెల్సిందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను తాను వ్యతిరేకించినట్లు చెప్పుకొచ్చారు కవిత. తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవ్వరికీ లేదన్న కవిత, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కడే నాయకుడని తెలిపారు. ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.

కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వడం తనకు రాదన్న ఆమె, కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా అంటూ కామెంట్ చేశారు. తన లేఖను బయటపెట్టిన లీకు వీరుడు ఎవరో తేలాల్సిందనని తేల్చిచెప్పారు. కేసీఆర్ నుంచి తనను విడదీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన కవిత, అలా చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెల్సన్నారు. తనతో చర్చలు జరిపిన దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు ఎవరికి దగ్గరో తనకు బాగా తెల్సన్నారు. తన తండ్రి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు కవిత.