ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రానికి కె.టీఆర్ లేఖ

Spread the love

బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, హాస్టళ్లు మరియు చిన్న తరహా ఆహార వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వాణిజ్య మరియు గృహ అవసరాల ఎల్‌పిజి సిలిండర్ల కొరతను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకపోతే వేలాది సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని, తద్వారా లక్షలాది మంది కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆయన కొన్ని ఆచరణాత్మక చర్యలను ప్రతిపాదించారు. చిన్న వ్యాపారులను రక్షించడానికి శ్రేణుల వారీగా ఎల్‌పిజి కేటాయింపు విధానం. గ్యాస్ లభ్యతపై పారదర్శకత కోసం రియల్ టైమ్ పబ్లిక్ డ్యాష్‌బోర్డ్. వాణిజ్య సిలిండర్ల ధరలపై తాత్కాలిక ధరల నియంత్రణ వంటి వాటిని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్  విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే పీజీ హాస్టళ్లు మరియు అణగారిన వర్గాల కార్మికులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ఆయన కోరారు. గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికల్లో కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాటిని అత్యవసర సేవలుగా గుర్తించి ప్రాధాన్య కేటాయింపు ఇవ్వాలని హోటల్ మరియు ఆహార రంగంపై ఆధారపడిన లక్షలాది మంది దినసరి కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడకుండా కేంద్రం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *