మొంథా తుఫాన్ ఎఫెక్ట్.!

Spread the love

Montha Cyclone Effect Telangana: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలపడింది . ఇది మొంథా తుపానుగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు క్షణ క్షణం భయం భయంగా గడుపుతున్నారు. తుపాను ప్రభావంతో ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే క్రమంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హై ఎలర్ట్ ప్రకటించింది. అదే విధంగా పలు రైళ్ల రాకపోకలు రద్దు చేసింది.

ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యగా పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. విశాఖ మీదుగా నడిచే 43 రైళ్లు తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, ఎల్టిటీతో పాటు పలు ప్రధాన రైళ్లు, పలు పాసింజర్ రైళ్లు ఉన్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విశాఖ మీదుగా నడిచే రైల్వే సర్వీసులు క్యాన్సెల్ అయ్యాయి. రద్దైన ట్రైన్స్ లిస్ట్ ను రైల్వే శాఖ రిలీజ్ చేసింది. తుపాన్ తీవ్రతను బట్టి రైల్వే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌, టైమ్‌టేబుల్‌ ను తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌ లేదా రైల్వే ఎంక్వైరీ సెంటర్ల ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపింది.

తుపాను ప్రభావం కారణంగా దక్షిణ మధ్య రైల్వే కూడా అలర్ట్ అయ్యింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ముందస్తు చర్యలు చేపట్టాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఆపరేషన్‌, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, మెడికల్‌ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని వివరించారు. Montha Cyclone Effect Telangana నిరంతరం అధికారులు అందుబాటులో ఉంటూ ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. రైలు వంతెనల స్థితి, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ట్రాక్‌లు, బ్రిడ్జిలపై నిరంతరం పెట్రోలింగ్‌ జరగాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చేరుకునేందుకు సర్వం సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. డిజిటల్‌ లోకో మోటివ్‌లు, మొబైల్‌ రెస్క్యూ టీమ్‌లు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు.

రద్దయిన రైళ్లు ఇవే :

27, 28 తేదీల్లో

18515/16 విశాఖపట్నం – కిరణ్ డోల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు

27, 28 తేదీల్లో

18525/26 విశాఖపట్నం – బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు

27వ తేదీన

22707 విశాఖపట్నం – తిరుపతి డబల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

27వ తేదీన

17243/44 గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు

27వ తేదీన

12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ రద్దు

27వ తేదీన

12738 విశాఖ సికింద్రాబాద్ మధ్య నడిచే గరీబ్ రథ్ రద్దు

27వ తేదీన

22707 విశాఖ తిరుపతి డబల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

27, 29 తేదీల్లో

20805/06 విశాఖపట్నం – న్యూఢిల్లీ ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు

27, 29 తేదీల్లో

18519/20 ఎల్టీటీ – విశాఖపట్నం (LTT ఎక్స్‌ప్రెస్) రాకపోకలు రద్దు

27, 28 తేదీల్లో

12861/ 62 విశాఖ – మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

27, 28 తేదీల్లో

22869/70 విశాఖ – MGR చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు

27, 28 తేదీల్లో

08583/84 విశాఖ – తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు

27, 28 తేదీల్లో

18512/11 విశాఖ – కొరాపుట్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు

27, 28 తేదీల్లో

67287/88 విశాఖ – కిరణ్ డోల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు

27, 28 తేదీల్లో

67287/88 విశాఖ – విజయనగరం రైలు రాకపోకలు రద్దు

28వ తేదీన

67289/90 విశాఖ – పలాస రాకపోకలు రద్దు

28వ తేదీన

67285/86 రాజమండ్రి – విశాఖపట్నం రాకపోకలు రద్దు

28వ తేదీన

17267/68 విశాఖపట్నం – కాకినాడ ఎక్స్‌ప్రెస్ రద్దు

28వ తేదీన

58501/02 కిరణ్ డోల్ – విశాఖ ప్యాసింజర్ రైలు రద్దు

28వ తేదీన

58538/37 కోరాపుట్ – విశాఖ రాకపోకలు రద్దు

28వ తేదీన

22875/76 విశాఖ – గుంటూరు డబల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

28వ తేదీన

58531/32 బ్రహ్మపూర్ – విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు

28వ తేదీన

58506/05 విశాఖపట్నం – గుణుపూర్ ప్యాసింజర్ రద్దు

28, 29 తేదీల్లో

68433/34 కటక్ – గుణుపూర్ రైలు రద్దు