అద్భుత వనం..!!

Spread the love

Dr Burgula Ramakrishna Rao College: బొటానికల్ గార్డెన్‌కు మరో ఆభరణం.. జీవ వైవిధ్య పరిశోధన మరియు విద్యా కేంద్రం. మన ఇంటి పెరట్లో జామ..నేరేడు.. బంతి..చామంతి.. కూరగాయాల తీగ జాతులు… పండ్లు.. పూలు ఇచ్చే మొక్కలను పెంచుకుంటాం. కాని ఎప్పుడూ చూడని అరుదైన పూల మొక్కలను ఓ గార్డెన్ లో పెంచుతున్నారు.అంతరించు పోతున్న పూలమొక్కలు..తీగ జాతి మొక్కలను భవిష్యత్తు తరాలుకు అందించేందుకు కృషి చేస్తున్న…ఆ బొటానికల్ గార్డెన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ

ఇది మహబూబునగర్ జిల్లాలోని జడ్చర్లలో ఉన్న డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఇక్కడి లెక్చరర్స్ విద్యార్థులకు చదువు చెప్పడమే కాకుండా మొక్కల పెంపకంపైనా శ్రద్ద వహించే విధంగా బోధిస్తారు. దీంతో విద్యార్థులు ఎప్పుడూ చూడని అరుదైన… అంతరించిపోతున్న పూల జూతుల…తీగ మొక్కలను నల్లమల ఆటవీ ప్రాంతంలో సేకరించారు. వాటిని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ లో పోషిస్తున్నారు. వందల రకాల పూల మొక్కలు..తీగ జాతిమొక్కలు..పండ్ల చెట్లను రిసెర్చ్ స్కాలర్స్ కు ఉపయోగపడేలా గార్డెన్ లో పెంచుతున్నారు.

కళాశాల అధ్యాపకులు డాక్టర్.సదాశివయ్య సమన్వయకర్త గా గార్డెన్ లో160 ఏళ్ల తర్వాత నల్లమల అడవిలో కనుగొన్న హెటెరోస్టెమ్ జెడ్రోమి అనే అరుదైన తీగ జాతి మొక్క లాంటి అనేక రకాల మొక్కలు ఇక్కడ వికసిస్తున్నాయి. ఇంటి పెరట్లో జామ..నేరేడు..బంతి..చామంతి..ఇలా పండ్లు..పూలు ఇచ్చే మొక్కలను పెంచుకుంటాం. కాని ఎప్పుడూ చూడని అరుదైన పూల మొక్కలను గార్డెన్ లో పెంచుతున్నారు. అంతరించు పోతున్న పూలమొక్కలను భవిష్యత్తు తరాలుకు అందించేందుకు కృషి చేస్తున్నారు.

ఆర్కిడ్ జాతులైన హాబినేరియా ఫర్సిఫెర, హాబినేరియా డిజిటేట, జియోడోరం డెన్సిఫ్లోరం, జియోడోరమ్ లాక్సిఫ్లోరమ్, యూలోఫియా గ్రమీనియా, లూసియా జైలానిక, వాండ టెస్టేసియా పూలు ఇటీవల వికసించాయి. వీటితో పాటు 12 జాతుల ఇతర ఆర్కిడ్ మొక్కలున్నాయి. హెటెరోస్టెమ్మ బెడ్డోమి అనే తీగ జాతి మొక్కను 160 ఏండ్ల తరువాత నల్లమల అటవీ ప్రాంతంలో సదాశివయ్య, ప్రసాద్(శ్రీ వేంకటేశ్వర కాలేజీ, న్యూ ఢిల్లీ) కనుగొన్నారు. దీనిని కేరళ ప్రాంతంలో 1862లో గుర్తించారు. దీనికి సంబంధించిన మొక్క నమూనా కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు.

డిగ్రీ నుంచి పీహెచ్​డీ వరకూ వృక్షశాస్త్రం ప్రాజెక్టులన్నింటినీ ఒకేచోటకు అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో తెలంగాణ బొటానికల్ గార్డెన్ రూపుదిద్దుకుంటోంది. కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బొటానికల్ అక్వేరియంలో అరుదైన.. అంతరించి పోతున్న 12 జాతుల మొక్కలను సంరక్షిస్తున్నారు.ఈ బొటానికల్ గార్డెన్ ను పరిశీలించేందుకు వివిధ యూనివర్సిటీ విద్యార్థులు వస్తున్నారు. పలు రకాల మొక్కలు వికసిస్తున్న అరుదైన పూలను చూసి ఆశ్చర్యపోతున్నారు. Dr Burgula Ramakrishna Rao College.

అరుదైన మొక్కల గార్డెన్ అంటే అంతరించిపోతున్న లేదా అసాధారణమైన లక్షణాలు కలిగిన మొక్కలను పెంచే ప్రదేశం. ఈ తోటలలో మొక్కలు, మరియు వివిధ రకాల ప్రత్యేక ఆకారాలు, రంగులు గల మొక్కలు ఉంటాయి. అరుదైన మొక్కల సంరక్షణ, అధ్యయనం మరియు ప్రదర్శన కోసం ఇలాంటి తోటలు ఏర్పాటు చేస్తారు.