తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఉపశమనం లభించింది. గ్రూప్-1 పోస్టింగ్ లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను రద్దు చేస్తూ ఇంతకుముందు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ ఆన్సర్ పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు అప్పీలు చేశారు. గతంలో విచారణ చేపట్టిన ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించింది.