తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు వివిధ ప్రజా సంఘాల నాయకుల మద్దతు 

Spread the love

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో  రాజకీయ  పార్టీగా జాగృతి బరిలోకి దిగుతుందని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ  కల్వకుంట్ల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే.  తెలంగాణ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తూ ఒక శక్తిగా ఎదుగుతుందని  లెఫ్ట్ పార్టీల సోదరులు, మావోయిస్టు సానుభూతి పరులు, మనుగడ కొనసాగించలేకపోతున్న మావోయిస్టులు, ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేసే పార్టీ రావాలనుకుంటున్న వారు తనకు మద్దతివ్వాలని పిలుపిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు ఆమెను కలిసేందుకు తనకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున జాగృతి కార్యాలయానికి ఉద్యమకారులు తరలివచ్చారు.  వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులకు ఆమె అభివాదం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ స్టేట్ కమిటీ, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాల మద్దతు పలికారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితను కలిసి సంఘీభావం తెలిపారు.