దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాటలోనే పయనించాయి. కీలక షేర్లయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ట్రెంట్ షేర్లలో భారీ అమ్మకాలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో రోజంతా మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగానే కొనసాగింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 376 పాయింట్ల నష్టంతో 85,063 వద్ద ముగిసింది. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 26,175 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.12 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు కూడా నష్టపోయాయి. అయితే మరికొన్ని కీలక షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.