
KTR and Ramesh: తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతాయా. రానున్న శాసనసభ ఎన్నికల నాటికి ఊహించని మార్పులతో రాజకీయం వేడెక్కుతుందా. దీనికి పునాది వేసింది ఎవరు. సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ కామెంట్స్ వెనుక అసలు రహస్యం ఏంటి. తాజా పరిస్తితులు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయా. వాచ్ దిస్ స్టోరీ.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అయినా, ఏ వ్యాపావేత్త అయినా కాంట్రాక్టులు తీసుకోవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. తెలంగాణా ఉద్యమ కాలంలో ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వడం ఏంటన్ని అప్పటి టీఆర్ఎస్ నేతలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలను ప్రశ్నించేవారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అందులోనూ బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలన సమయంలో కూడా ఆంధ్ర వాళ్లకు తెలంగాణాలో కాంట్రాక్టులు దక్కాయి. దీన్ని ఎవరూ క్వచన్ చేయలేదు. అంతా, వ్యాపారంలో భాగంగా చూశారే తప్ప, ప్రాంతీయ సమస్యగా భావించలేదు.
సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో కేటీఆర్ కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. రేవంత్ పాలనలో రైతులను పట్టించుకోవడం లేదంటూ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న కేటీఆర్, తాజాగా రైతుబంధు మీద తీవ్రంగా మాట్లాడారు. మొదట 50 వేల కోట్ల రూపాయలను రైతుబంధు పథకానికి కేటాయిస్తామని మొదట ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం చివరికి 12 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో రేవంత్ మీద చెలరేగిపోయారు కేటీఆర్. రైతులను తీవ్రంగా మోసం చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. KTR and Ramesh.
ఆ తర్వాత కేటీఆర్ డైలాగ్ మారింది. సడెన్ గా ఆయన టార్గెట్ సీఎం రమేష్ అయ్యారు. సీఎం రమేష్ కు చెందిన ఓ కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన కేటీఆర్, ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ కామెంటును తెర మీదకు తెచ్చారు. ఉద్యమ కాలంలో వాడిన డైలాగ్ మరోసారి పేల్చాలని చూశారు. కానీ అది బూం రాంగ్ అవుతుందని కేటీఆర్ ఏమాత్రం ఊహించలేకపోయారట. ఎందుకంటే, సీఎం రమేష్ అదే స్తాయిలో మండిపడటంతో కేటీఆర్ ఢిఫెన్సులో పడ్డారట.
కేటీఆర్ చేసిన కామెంట్ వెనక కాంట్రాక్టుల మంజూరు కంటే, రాజకీయ కోణం బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో ఆంధ్రపార్టీ అంటూ టీడీపీ మీద కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఆ నినాదమే ఊతంగా మారింది. కానీ ఇప్పుడు పరిస్తితులు మారుతున్నాయి. ఓవైపు బీజేపీ తెలంగాణాలో క్రమంగా బలం పెరుగుతోంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదనేది విశ్లేషకుల మాట. ఇక తెలుగుదేశం పార్టీకి జంటనగరాలతో పాటు కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతల్లో చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. అందుకే ఈ రెండు కలిస్తే ఇబ్బంది పడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.
ఇదంతా అంచనా వేస్తున్న బీఆర్ఎస్ పెద్దలు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూటమి బరిలో దిగితే, తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవని కేసీఆర్ అండ్ కో డిసైడ్ అయ్యారట. అదే జరిగితే ఆ ప్రభావం వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే లిక్కర్ స్కాం, కాళేశ్వరం కుంభకోణంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులతో ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం, పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో నానా తంటాలు పడాల్సి వస్తోందట. దీంతో ఎలాగొలా, ఈ పరిస్తితులను కంట్రోల్లోకి తెచ్చుకుని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు పడకూడదన్న నిర్ణయానికి వచ్చింది బీఆర్ఎస్ నాయకత్వం. దీనికి నాందిగా సీఎం రమేష్ ను టార్గెట్ చేశారు కేటీఆర్. ఓ కంపెనీకి దక్కిన కాంట్రాక్టును ప్రాంతీయ కోణంలో తెరమీదకు తెచ్చారు. కానీ ఆయన వ్యూహం బెడిసికొట్టినట్లు అయింది.
కేటీఆర్ ఆరోపణలకు తీవ్రంగా స్పందించారు సీఎం రమేష్. లిక్కర్ స్కాం సమయంలో వారిద్దరి మధ్య ఢిల్లీలో జరిగిన సంభాషణలను బయటపెట్టేశారు. తమపై కేసులు లేకుండా చేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి సిద్దంగా ఉన్నామని కేటీఆర్ స్వయంగా అన్నట్లు సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. దీంతో గతంలో కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల్లో నిజం ఉందని ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఎందుకంటే, ఇప్పటి దాకా కేటీఆర్ అండ్ టీం సీఎం రమేష్ కామెంట్స్ మీద కౌంటర్ ఇవ్వలేదు. ఇచ్చే పరిస్తితి కూడా కనిపించడం లేదన్న విమర్శలు బీఆర్ఎస్ పార్టీలోనే కొంతమంది చెబుతున్నారట. ఇదే ఇప్పుడు కారు పార్టీకి ఇబ్బందిగా మారిందట. తాజా పరిస్తితులు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను ఇరకాటంలో పెడుతున్నాయట. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుందన్న ప్రచారం స్థానికంగా నేతలకు ఇబ్బందులు తెస్తున్నాయట. ఓవైపు స్తానిక ఎన్నికలకు పార్టీ కేడర్ రెడీ అవుతుంటే, ఈ గోల ఏంటని జిల్లా బీఆర్ఎస్ నేతలు చిరాకు పడుతున్నారట.