కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్ అంటూ పేర్కొన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని పేర్కొన్నారు. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదు…అహంకారం అంతకంటే కాదు.తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉందన్నారు. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు.ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని ఘాటుగా స్పందించారు.