కె.సి.ఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీ.ఆర్.ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్ విమర్శించారు. ఇది విచారణ కాదు…ఇది ప్రతీకారం.ఇది న్యాయం కాదు…ఇది రాజకీయ దురుద్దేశం అంటూ సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు.నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం.తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు…ప్రజల తీర్పుతోనే రాస్తారని పేర్కొన్నారు.