హామీలను నెరవేర్చేవరకు రేవంత్ సర్కారుని ఎండగడుతూనే ఉంటాం:కె.టి.ఆర్ 

Spread the love

పుట్టిన మట్టి సాక్షిగా నేను ఎన్నడూ ఎలాంటి అక్రమ, అనైతిక పనులు చేయలేదని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.ఆర్ అన్నారు.  తనను  వ్యక్తిత్వ హననం చేస్తున్న రేవంత్ రెడ్డి, ఆయన తొత్తులు, కొంత మంది అధికారులు ఎవ్వరినీ వదిలి పెట్టనని ఫైర్ అయ్యారు.ఎన్ని డైవర్షన్ గేమ్‌లు ఆడినా.. అర్జునుడి కన్ను తన లక్ష్యంపైనే ఉన్నట్టే తమ గురి మారదని స్పష్టం చేశారు. న్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు. నేను వెళ్తాను. కానీ, నేను వారికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. 420 హామీలు ఇచ్చి 4 కూడా నెరవేర్చని రేవంత్ రెడ్డి రాజకీయాలను ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటామని కె.టి.ఆర్ దుయ్యబట్టారు. గత రెండు సంవత్సరాలుగా డైలీ సీరియల్ మాదిరిగా లీకులు ఇస్తూ, తనపై  వ్యక్తిత్వ హననం చేస్తున్న ఈ ప్రచారానికి ఒక్క సాక్ష్యం అయినా ఉందా? ప్రశ్నించారు. కేవలం మీడియా లీకులే తప్ప, ఒక్క అధికారిక సాక్ష్యం కూడా లేకుండా ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు?లీకుల పేరుతో డ్రామాలాడుతున్న వారిని ఎవరినీ వదిలిపెట్టం.హామీలను నెరవేర్చేవరకు రేవంత్ సర్కారుని ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎవరికీ భయపడకుండా.. ఎవరికీ తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా.. కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేదాకా కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు.