ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో పరిశ్రమల శాఖ పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీ లో ల్యాండ్ అలాట్మెంట్ ,పరిశ్రమల ఏర్పాటుపైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నెట్ జీరో సిటీ తరహా లోనే డిజైన్స్ ఉండాలని మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ఇందులో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలన్నారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీ కి తీసుకురావాలని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ లో ప్రజా ప్రతినిధులు,సివిల్ సర్వీస్ అధికారులు,జర్నలిస్ట్ లకు 500 ఎకరాలు కేటాయించనున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆకర్షణీయమైన లోగో,వెబ్ సైట్ రూపొందించాలని ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ను ఫ్యూచర్ సిటీ వచ్చేలా చర్య లు తీసుకోవాలన్నారు. అవసరం అయితే ప్రధాని మోదీ ని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దామని అన్నారు. జూన్ లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్క్ లో పరిశ్రమల ఏర్పాటు కు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరు లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టే వారి
కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థ ని రూపొందించాలన్నారు. తమిళనాడు,గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలని సూచించారు. జీసీసీ లు, డేటా సెంటర్లు కోసం కరీంనగర్,వరంగల్,విజయవాడ రోడ్ల సమీపం లో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలన్నారు. సెకండ్ గ్రేడ్ సిటీలలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు పైన దృష్టి పెట్టేలా పాలసీ రూపకల్పన చేయాలన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి , తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) వైస్ చైర్మన్ శశాంక ,పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.