టైమ్​ ఛేంజ్​ అలెర్ట్​! జీ సరిగమప సీజన్​ 16

విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు సింగింగ్​ షో సరిగమప సీజన్ 16 – ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ ప్రత్యేక ఎపిసోడ్స్​తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మ్యూజికల్ రియాలిటీ షో సరిగమప సీజన్​ 16 నవంబర్ 10 నుండి ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారం కానుంది.


ఎనర్జిటిక్​ యాంకర్​ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ సీజన్​కి సంగీత దిగ్గజాలు కోటి, ఎస్పీ శైలజ, కాసర్ల శ్యామ్​తో ఈ సీజన్ ఉత్తేజకరమైన ప్రదర్శనలు, మనసును హత్తుకునే పాటలతో సంగీత ప్రియులకు మరింత వినోదం పంచబోతోంది. ప్రతి కంటెస్టెంట్​ తమ ఆకట్టుకునే ప్రదర్శనలతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్​గా మారుతున్నారు.


ఆదివారం అంతులేని వినోదం అందించే ఉద్దేశంతో జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ప్రసార సమయాన్ని మరింత పెంచింది. శ్రోతల మనసును తాకే సంగీతంతోపాటు చక్కని వినోదం అందించే లక్ష్యంతో వస్తున్న జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటలకు, తప్పక చూడండి!

సంగీత ప్రియులకు జీ తెలుగు కానుక.. సరిగమప సీజన్​ 16 ఈ ఆదివారం నుండి ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటలకు, మిస్​ కాకండి!