జమ్మూ కాశ్మీర్ లో భారీగా హిమపాతం..పలు విమానాల రద్దు

Spread the love

జమ్మూ కాశ్మీర్ లో మంచు భారీగా కురుస్తోంది. దీంతో శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో  50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు ఎయిర్ పోర్టు  అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఓ ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ పోర్టులో వాతావరణం ప్రతికూలంగా ఉందని, మంచు కురుస్తూనే ఉందని AAI  పేర్కొంది. దీంతో శ్రీనగర్ కు  రావాల్సిన 25.. అక్కడినుంచి బయలుదేరాల్సిన మరో 25 విమానాలను రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఫ్లైట్ల  కోసం ప్రయాణికులు.. విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించింది. విమానాల రద్దు కారణంగా, వీకెండ్ హాలిడేస్ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన అనేక మంది టూరిస్ట్ లు చిక్కుకుపోయారు.