రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు పట్ల 70శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పూర్తిగా అరికట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గంజాయి సాగు జీరో రాష్ట్రంగా ఏపీ మారిందని, ప్రణాళికాబద్ధంగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణ నెట్ వర్క్ లను ధ్వంసం చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై సచివాలయంలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మైనర్లను (నిర్ణీత వయస్సు) సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టే హేబిచ్యువల్ అఫెండర్స్ పై కఠినచర్యలు చేపట్టాలని ఆదేశించారు.