ఈ సంక్రాంతి సీజన్ విన్నర్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా కలెక్షన్ల పరంగా ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దాదాపు రూ.400కోట్ల వైపు పరుగెడుతోంది. ఇక ఈ సినిమా గురించి పక్కనబెడితే, మెగాస్టార్ నెక్స్ట్ సినిమా బాబీ తో అన్న సంగతి తెలిసిందే కదా. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తో వీరిద్దరూ మంచి సక్సెస్ కొట్టారు. ఇక ఇప్పుడు ఒక మంచి కుంటుంబ కథ తో పాటు యాక్షన్ ఎలెమెంట్స్ ఉన్న స్టోరీ ని లైన్ లో పెట్టారంట.
ఇక ఈ సినిమా హీరోయిన్ ఎవరు??? నయన్ ని ఆల్రెడీ శశిరేఖ గా చూసాం… మరి ఈసారి మెగాస్టార్ తో జోడి కట్టేది ఎవరో తెలుసా??? ప్రియమణి అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి క్యారెక్టర్ చాల ఇంపార్టెంట్ అని ఇంకా ఈ సినిమా mohanlal కూడా ఉంటారని, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ సినిమా లో ప్రియమణి చిరు లకి కూతురు కూడా ఉంటుంది అని, అది స్టార్టింగ్ లో కృతి శెట్టి అని అన్నారు. కానీ తరవాత అవన్నీ తప్పుడు వార్తలే అని తేల్చేసారు. సో, మరి ఇప్పుడు ఆ కూతురు రోల్ ఎవరు చేస్తారు అని టాక్ అఫ్ ది టౌన్! త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత రానుంది.