ప్రభాస్ స్పిరిట్ లో విలన్ అతనేనా???

Spread the love

ఈ ఏడాది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నెక్స్ట్ ప్రభాస్ మన సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి  హీరోయిన్. సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో హీరో కి ఏమాత్రం తీసిపోకుండా విలన్ క్యారెక్టర్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కాగా,  ఈ సినిమా లో విలన్ ఎవరు అంటే… కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అతను సాదా సీదా యాక్టర్ కాదు Train To Busan ఇంకా Marvel’s Eternals సినిమాలో నటించి ఇంటర్నేషనల్ ఆడియన్సు మెప్పు పొందిన నటుడు. సో, ప్రభాస్ కట్ అవుట్ కి డాన్ లీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతాడు! ఇప్పటి వరకు official అనౌన్స్మెంట్ రాలేదు కానీ, మార్చ్ 1st న డాన్ లీ బర్త్డే కావడం తో ఆ రోజు డాన్ లీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అది నిజమో కాదో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. ఇక ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు! అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో అదరగొట్టిన సందీప్ ప్రభాస్ ను డైరెక్ట్ చేయనుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. 2027 మార్చి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.