అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లోహిత్ వ్యాలీ ఫారెస్ట్ లో కార్చిచ్చు రేగింది. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. 12 వేల లీటర్ల నీటితో మంటలను అదుపు చేసేందుకు ఎంఐ-17వీ5 హెలికాప్టర్లను మోహరించింది. అయితే, దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి మంటలను ఆర్పేందుకు కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకుఎయిర్ ఫోర్స్, అటవీశాఖ అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టింది. కార్చిచ్చుకి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను స్థానిక అధికారులు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అసాధారణమైన ధైర్యంతో, ఖచ్చితత్వంతో ప్రాణాలను అలాగే సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను రక్షించడంలో అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది.