క్రమంగా దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

Spread the love

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు సామాన్యుడికి భారంగా మారి అదుపు లేకుండా పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. ఇక భారతీయ మార్కెట్లో 24K 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలకు దగ్గరగా కూడా వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి… అయితే ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండడంతో సామాన్యుడికి కాస్త ఊరట లభించనుంది. గత రెండు రోజులుగా పసిడి ధరలు దిగివసున్నాయి. ఈ రెండు రోజుల్లో  బంగారం , వెండి ధరలు అత్యంత వేగంగా పతనమయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర వేలల్లో తగ్గడంతో గోల్డ్  షాప్స్ కస్టమర్లతో  కిటకిటలాడుతున్నాయి.. ఇక బంగారం ధర ఒక్క రోజులోనే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 790 తగ్గి రూ. 14,720 లకి చేరింది.ఈరోజు (31-01-2026) కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. దీనిలో భాగంగా ఈరోజు 1 గ్రాము 22k బంగారం ధర ఏకంగా రూ. 790 తగ్గి రూ. 14,720 వద్ద ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 16,000 మార్క్ ని టచ్ చేసిన బంగారం ధర నిన్న, ఈరోజు మాత్రం భారీగా పతనం అవ్వడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నపరిస్థితులు కూడా దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని దేశాల మధ్య నెలకొన్న అస్థిర పరిస్థితులు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, డాలర్ పతనం వంటి వివిధ కారణాలతో గత కొంత కాలంగా అతి భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు పరిస్థితులు కొంత మేర సద్దుమణగడంతో ఇన్వెస్టర్లు తమ వద్ద వున్న బంగారాన్ని విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. దీని కారణంగా బంగారానికి డిమాండ్ తగ్గి బంగారం ధరలు తగ్గుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధారలుగా  మార్కెట్‌ లో ఒక్క రోజులోనే భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు పడిపోయాయి. రికార్డు గరిష్ట స్థాయికి చేరిన తర్వాత వెంటనే ఈ పతనం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.