ప్రతి ఏటా స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానందుని ఆదర్శాల నుండి శక్తిని పొందుతుందని పేర్కొన్నారు. ఆయన జీవితం భారతీయ యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మరియు సేవాభావాన్ని నింపిందని యువత తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని, జ్ఞానాన్ని సముపార్జించాలని మరియు క్రమశిక్షణ, ఐక్యతతో దేశం కోసం, మానవాళి కోసం నిస్వార్థంగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారని పేర్కొన్నారు. దేశానికే గొప్ప బలమైన యువత అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలంటూ చంద్రబాబు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
మంత్రి నారా లోకేష్ :
సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తన ప్రసంగాలతో నవతరానికి దిశానిర్దేశం చేశారు. ఆధునిక భారత నిర్మాణం కోసం పరితపించారు. లక్ష్యసాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా గమ్యం చేరే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. వివేకానంద స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి కృషిచేద్దాం. ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.