దేశ జీడీపీ కంటే…ఇళ్లలోని బంగారం విలువే ఎక్కువ..!

Spread the love

భారతీయులకు బంగారంపై ఉన్న తిరుగులేని మక్కువ ఆర్థిక రంగంలో ఒక సరికొత్త రికార్డును సృష్టించింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్సుకు $4,500 మార్కును దాటడంతో, భారతీయ గృహాల్లో ఉన్న పసిడి నిల్వల విలువ దేశ మొత్తం జీడీపీ ($4.1 లక్షల కోట్లు) కంటే ఎక్కువగా, సుమారు $5 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.మోర్గాన్ స్టాన్లీ గణాంకాల ప్రకారం.. భారతీయుల వద్ద సుమారు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉందని అంచనా వేశారు.ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే ప్రజల వ్యక్తిగత సంపద (బంగారం రూపంలో) ఎంత శక్తివంతంగా ఉందో స్పష్టం చేస్తోంది.అయితే ఇందులో 80 శాతం ఆభరణాల రూపంలోనే ఉండటం వల్ల, ధరలు పెరిగినా వీటిని ప్రజలు అమ్మే అవకాశం తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం సామాన్యులే కాకుండా, ఆర్బీఐ కూడా భద్రత దృష్ట్యా తన నిల్వలను 880 టన్నులకు పెంచుకుంది. పసిడిని ఒక నిరుత్పాదక ఆస్తిగా నిపుణులు అభివర్ణించినప్పటికీ, భారతీయ సంస్కృతిలో దానికి ఉన్న మానసిక, సామాజిక భద్రత కారణంగా భౌతిక బంగారంపై మోజు ఏమాత్రం తగ్గడం లేదు.