​ జీ తెలుగు ఉమ్మడి కుటుంబం

కుటుంబమే ప్రధానంగా తెరకెక్కుతున్న ​ ఉమ్మడి కుటుంబం

ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునేకథలతో సాగే సీరియల్స్ అందిస్తున్నజీతెలుగు మరో సరికొత్త సీరియల్ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, అనురాగాలనేపథ్యంలో సాగే ఆసక్తికరమైనకథ, కథనంతో రూపొందుతున్న సరికొత్తసీరియల్ ‘ఉమ్మడి కుటుంబం’. ఈ సీరియల్లో ఉమ్మడి కుటుంబం విశిష్టత, ప్రాధాన్యం, కుటుంబ సభ్యుల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్తకోణంలో చూపించనున్నారు. ఆకట్టుకునే కథతో రానున్న ‘ఉమ్మడి కుటుంబం’ నవంబర్ 4నప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు, మీజీతెలుగులో!

ఉమ్మడికుటుంబం అనే విలక్షణమైన కుటుంబ నేపథ్యంలో సాగే సరికొత్త సీరియల్తో వచ్చేస్తోంది జీ తెలుగు. కుటుంబమే మొదటి ప్రాధాన్యతగా జీవిస్తున్న ఆనంద భైరవి(రూప) తన కొడుకు కోసం తగిన వధువుని వెతుకుతుంది. సౌమ్యత, గౌరవం కలబోసినట్లున్న శరణ్య(సాక్షి)ను తన కొడుక్కి తగిన భాగస్వామిగా నమ్ముతుంది ఆనంద. శరణ్యసోదరిఅనన్య (సుస్మిత) అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ స్వేచ్ఛయుత జీవనాన్ని ఇష్టపడుతుంది. ఆనంద కుటుంబంలోకి అనన్య ఎలా ప్రవేశిస్తుంది? శరణ్య జీవితంలో ప్రతినాయకి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఉమ్మడి కుటుంబం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
రూప (ఆనంద),యశ్వంత్ (దర్శన్), సాక్షి (శరణ్య) ప్రధానపాత్రల్లోనటిస్తున్నఈసీరియల్లో కరమ్ (రోహిత్), సుస్మిత (అనన్య) కీలకపాత్రల్లోకనిపించనున్నారు. అన్నదమ్ములు, తోడికోడళ్ల అనుబంధం, అసూయ, ప్రతీకారం ముఖ్యాంశాలుగా ఆసక్తికరంగా సాగే ఉమ్మడి కుటుంబం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతుంది.. మీ జీ తెలుగులో మాత్రమే!
జీ తెలుగుఅందిస్తున్న కొత్త సీరియల్’ఉమ్మడికుటుంబం’ ప్రారంభంతోప్రస్తుతంఉన్న ఇతర సీరియళ్ల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.మధ్యాహ్నం12గంటలకు ప్రసారమవుతున్న సీతారామ ఇక నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు ప్రసారమవుతుంది. చాలాకాలంగా జీతెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్యకాంతం సీరియల్ ముగియనుంది. ప్రేక్షకులు ప్రసార సమయాల్లో మార్పుని గమనించి కొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబంతోపాటు మీ అభిమాన సీరియల్స్ చూసేయండి!