అదీ లెక్కా…గిన్నిస్ బుక్‎లో మెగాస్టార్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్​కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్​కు చిరంజీవి , కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు. అవార్డు అందుకునే సమయంలో హీరో సాయి ధరమ్ తేజ్ విజిల్ వేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. కుమార్తె సుష్మిత తన తండ్రి సాధించిన ఘనత చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ పురష్కారాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు.

తమ అభిమాన హీరోకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కడంతో మెగాస్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటివరకు 150కి పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్, తన నటన, డాన్స్, ఫైట్స్ లతో సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పాత్ర ఏదైనా, తన ముద్ర వేసి ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయడంలో మెగాస్టార్ చిరు తరువాతే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయనను పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులు కూడా వరించాయి. ఇక ఇప్పుడు గిన్నిస్ బుక్ లో కూడా చోటు దక్కడం తెలుగు ప్రజానీకానికి ఎంతో గర్వకారణమని ప్రముఖులు చెబుతున్నారు. ఇకపోతే గతంలో వెయ్యికి పైగా సినిమాల్లో నటించినందుకు గాను హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యావత్ ప్రపంచమంతా తెలుగు సినీ పరిశ్రమ వైపు చూస్తున్న వేళా.. ఫెమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పురష్కారం మెగాస్టార్ చిరంజీవికి దక్కడం నిజంగా హర్షించాల్సిన విషయమే.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల కానుంది. మరి 69 ఏళ్ల వయసులో తన నటన, డాన్సులు,ఫైట్లతో అభిమానులను అలరిస్తున్న మెగాస్టార్.. ఇలాగే మరెన్నో పురష్కారాలు అందుకుంటూ తెలుగు సినిమా ఖ్యాతి పెంచాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.