విజయవాడ బందర్ రోడ్డులో చెన్నై షాపింగ్ మాల్ నూతన షో రూమ్ హీరోయిన్ శ్రీ లీల ప్రారంభించారు. గతంలో విజయవాడలో చాలా షోరూమ్ లు ప్రారంభించానని, కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకతే వేరని శ్రీలీల తెలిపారు. అమ్మకి పట్టుచీరలు అంటే చాలా ఇష్టం, అందుకే తాను కూడా పట్టుచీరలు కట్టుకుంటానని వెల్లడించారు. లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలు అంటే చాలా ఇష్టమన్నారు. సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందని, రవితేజ తో త్వరలో కొత్త సినిమా ప్రారంభం కానుందని తెలిపింది.