కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి మరణం వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సరైన వైద్యం అందలేదన్నారు. స్వైన్ ఫ్లూ రోగిని ఏచూరి పక్క బెడ్ లోనే అడ్మిట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఏచూరి మరణం వెనక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మానవత్వం,సెక్యులరిజం, దళితులు గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసుల చేత కొట్టించడం మానవత్వమా అని జగన్ ను ప్రశ్నించారు. ఐదేళ్లు బిజెపితో భజన చేసిన జగన్ సెక్యులరిజం గురించి మాట్లాడే నైతికత లేదన్నారు.