కంగనా రనౌత్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్

మెగా9 వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..నటి కంగనా రౌనత్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 2025 జనవరిలో విడుదల కానున్న ఎమర్జెన్సీ సినిమాపై భట్టి విక్రమార్క విమర్శలు చేశారు.

మంగళవారం గాంధీభవన్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నవారు ఇందిరా గాంధీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఆమె స్ఫూర్తితో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఇందిరా గాంధీ స్పూర్తితో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగణన చేస్తున్నామని తెలిపారు. కులగణన దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలబడుతుందని అన్నారు. దేశమే తెలంగాణ వైపు చూసేలా ఈ కులగణన ఉండబోతుందని చెప్పారు.

వరంగల్ నగరంలో ఈరోజు ఇందిరా గాంధీ స్పూర్తితో ఇందిరా మహిళ శక్తి పేరుతో మహిళలను అనేక రంగాల్లో తీర్చిదిద్దుతామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ , బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇద్దరు ఒక్కటేనని విమర్శించారు. లగచర్లలో అమాయక గిరిజనులను ఒక రాజకీయ పార్టీ రెచ్చగొట్టి కలెక్టర్ పైన దాడి చేయించారని ఆరోపించారు. ప్రజల దగ్గర నుంచి బీఆర్ఎస్ హయాంలో బలవంతంగా భూములు లాక్కున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఆరోపించారు.