కడప గడ్డపై సందడి చేయనున్న రామ్ చరణ్

మెగా9 వెబ్ డెస్క్: కడప గడ్డపై సందడి చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం కడప పెద్ద దర్గాను దర్శించుకోనున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత ఉత్సవాలకు హాజరవుతారు. అమీన్ పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ హాజరవ్వనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు ప్రయాణం అవుతున్నారు రామ్ చరణ్. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి.. సాయంత్రం 6:30 కు కడుపులో ల్యాండ్ అవుతారు చరణ్. కడప ఎయిర్ పోర్ట్ నుంచి ఈవెంట్ ప్లేస్ వరకు భారీ ర్యాలీగా వెళ్ళనున్నారు చెర్రీ. ఇక దర్గాకు రామ్ చరణ్ వస్తుండడంతో ఈవెంట్ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.