తిరుమలను జగన్ స్వార్ద రాజకీయాల కోసం వాడుకోవడం నీచమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. తిరుమల వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదనడం హాస్యాస్పదం అన్నారు. మనం అనుకుంటే కాదు, స్వామి అనుగ్రహిస్తేనే తిరుమల వెళ్లగలమన్నారు. వెంకన్న అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారన్నారు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్ కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని బుద్ధా ప్రశ్నించారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్దాంతం ఎందుకన్నారు. నీ ఇంట్లో నీ భార్యని కూడా తిరుమల తీసుకు రాలేవని జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం హోదాలోనే నీఇంట్లో వాళ్లు నీ మాట వినలేదన్నారు.