పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ కు ఇప్పుడు నోటీసులు ఇచ్చారని, మాకు అలాంటివి ఎప్పుడో ఇచ్చారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. జగన్ తిరుపతిలో అల్లర్లు,మతకల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని, ఆయన్ను కొట్టడానికి తాము గుడ్లు కొన్నామని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని తెలిపారు. గులకరాయో,గొడ్డలి వేటు లాంటివి మరలా క్రియేట్ చేసి సానుభూతి పొందాలని చూసారన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తాము తిరుపతిలో శాంతియుత నిరసనలు విరమించుకున్నామని తెలిపారు. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదు..పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడని, అందుకే డుమ్మా కొట్టడానికి వేంకటేశ్వర స్వామిని వాడుకున్నారని ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయద్దని వైసీపీని కిరణ్ రాయల్ కోరారు.