తిరుమల లడ్డూ వివాదం, జగన్ దర్శనం ప్రయత్నాల నేపథ్యంలో బీజేపీ నేతలు ఇవాళ టీటీడీ ఈవోను కలిశారు. డిక్లరేషన్ నమూనాలను వెంట తీసుకెళ్లిన బీజేపీ నేతలు.. జగన్ తో దానిపై సంతకం చేయించాల్సిందేనని ఈవోను కోరారు. వైసీపీ హయాంలో డిక్లరేషన్ ను మర్చిపోయారని, అన్యమతస్తుల కోసం డిక్లరేషన్ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్నారు. లేకపోతే తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు.