జనసైనికులపై రెచ్చిపోయిన పేర్ని కిట్టు..! ఇల్లు ముట్టడికి వస్తారా..

బందరులో తన ఇంటి ముట్టడికి వచ్చిన జనసైనికులపై మాజీ మంత్రి పేర్నినాని తనయుడు కిట్టు రెచ్చిపోయారు. తన ఇంటి ముట్టడికి ఎలా వస్తారని వారిని ప్రశ్నించారు. జనసేన క్యాడర్ పేర్ని నాని దిష్టిబొమ్మ దహనం చేసి నిరసనలకు దిగడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మీకు 40 మంది ఉంటే మాకు 400 మంది ఉన్నారంటూ నిరసనకు వచ్చిన వారిని హెచ్చరించారు. ఇలాంటి చర్యల్ని సహించబోమన్నారు.