గత ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమై పోయిందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తిరిగి దాన్ని గాడిన పెట్టేందుకు రైతుల భాగస్వామ్యంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సాగునీటి వ్యవస్థకు పునర్జీవనం కలిగించే విధంగా ఎన్నికలు నిర్వహించడానికి జీవో విడుదల చేసినట్లు రామానాయుడు తెలిపారు. నవంబర్ మొదటి వారంలోపు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.