మెగా9, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పుష్ప – 2 ట్రైలర్ ఆదివారం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దాదాపుగా 25 వేల మందికి పైగా అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రజలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అల్లు అర్జున్, రష్మిక లను చూడడానికి పోల్స్ పైకి ఎక్కారు. దీంతో అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేసినట్టు సమాచారం.
బీహార్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో రిలీజ్ ఈవెంట్లు జరగకపోవడంతో సినీస్టార్స్ ని చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే పుష్ప సినిమాలోని కొన్ని షాట్స్ ను రీ క్రియేట్ చేస్తూ పోల్స్ పైకి ఎక్కారు ఫాన్స్. దీంతో నార్త్ లో పుష్ప హవా మామూలుగా లేదంటూ నెటీజనులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి పుష్ప -2 హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందాన, ప్రొడ్యూసర్స్ నవీన్ యేర్నేని, యలమంచిలి రవిశంకర్ తదితరులు హాజరయ్యారు