ప్రజెంట్ ఆయన పేరు చెబితే సినీ అభిమానుల్లో ఒక వైబ్రేషన్… బాక్సాఫీస్ బరిలో దిగితే రికార్డుల సెన్సేషన్.. వెయ్యి కోట్లయినా, 15 వందలకోట్లను అవలీలగా సాధించడం ఆయనకు మాత్రమే సాధ్యం. ఆరడుగుల అందగాడుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఫస్ట్ మూవీతోనే మాస్ కిక్ ఎక్కించిన ఈశ్వరుడాయన. ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం.. నిస్వార్థ స్నేహానికి నిదర్శనం బహుశా ఆయనేనేమో.. అందుకే అభిమానులకు ఆయనొక డార్లింగ్. అమ్మాయిల మనసు దోచే మిస్టర్ పర్ ఫెక్ట్. ఆయనెవరో ఇప్పటికే అర్థమైపోయింది కదూ.. ఆయనే ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన ఈ అక్టోబర్ 23 నాటికీ 45వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. దీంతో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. తమ అభిమాన హీరోకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్ కూడా వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ప్రభాస్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.