మెగా ప్రస్థానం @50 ఏళ్ళు

మన తెలుగు సినిమా గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటారు . మెగాస్టార్ సినిమా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. కానీ వెండితెర కంటే ముందే చిరు నటుడుగా అలాగే నాట్యకారునిగా కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అయితే తాను X వేదిక గా ఒక అరుదైన మెమొరీ షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది. తాను తన బికాం చదువుతున్న కాలేజీ రోజుల్లో వేసిన నాటకం గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

‘రాజీనామా’ వైఎన్ఎం కాలేజీ నర్సాపూర్ లో ‘రంగస్థలం’ మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు ..అది ఉత్తమ నటుడు కావటం.. ఎనలేని ప్రోత్సాహం..1974 నుంచి 2024 కి 50 సంవత్సరాలు తన నట ప్రస్థానంకి పూర్తయ్యింది అని దీని విషయంలో ఎనలేని ఆనందంగా ఉన్నట్టుగా మెగా స్టార్ పోస్ట్ చేశారు. రంగస్థలం పై ఆయన ప్రదర్శన రంగ‌స్థ‌లంపై ఆయన చేసిన పాత్రలకి మంచి పేరు తెచ్చుకుని అదే ఆత్మ‌విశ్వాసంతో మ‌ద్రాసుకు వెళ్లి చిరు న‌ట‌శిక్ష‌ణ తీసుకున్నారు. అటుపై న‌టుడిగా త‌న కెరీర్ ని మ‌లుచుకున్నారు.